MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 11:00 గంటల నుంచి ఆయన క్యాంపు కార్యాలయంలోనే ఉండి ప్రజల సమస్యలను స్వయంగా విననున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.