KMR: బీబీపేటలో ఏప్రిల్ 2న శ్రీ బాలాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం పంచామృతాభిషేకం, సింధూరపూజ,హోమం వంటి పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదానం, సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు నిర్వహించనున్నారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు.