TG: మాజీమంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. సభలో ఎవరు ఎవరి గొంతు నొక్కారో అందరికీ తెలుసని అన్నారు. ‘అసెంబ్లీలో 16 గంటలకు పైగా సమయం కేటాయించారు. KTR, హరీష్ రావు 6 గంటలు మాట్లాడారు. BRSలో మిగతా సభ్యుల గొంతు హరీష్, KTR నొక్కారు. బీఆర్ఎస్ చేష్టలతో సభాసమయం వృధా అయ్యింది’ అని మండిపడ్డారు.