NLG: రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (TSPF) నాగార్జున సాగర్ యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026’లో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాగర్ పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను సేకరించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.