NZB: బోధన్ పట్టణంలో నిర్వహించే హనుమాన్ జయంతి ర్యాలీలో డీజేలకు పర్మిషనల్ లేదని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈమేరకు పట్టణంలో ర్యాలీ ఆర్గనైజర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. ర్యాలీలో పాటించాల్సిన నియమ నిబంధనలు క్షుణ్ణంగా వివరించారు. ప్రతిఒక్కరూ ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొనాలన్నారు.