NRML: ఆశా వర్కర్ పద్మకు న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు గంగమణి డిమాండ్ చేశారు. ఖానాపూర్లో వారు మాట్లాడుతూ.. ఓ గర్భిణీ స్త్రీకి ప్రసవ విషయంలో సహాయం చేసిన నేపథ్యంలో ఏఎన్ఎం చంద్రకళ పద్మను దుర్భాషలాడిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి పద్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.