KMM: దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర నేడు ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80 ఏళ్లు సమీపిస్తున్నా కూడా బీసీ కులాలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో బీసీ సంఘ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.