సినిమా నేపథ్యం లేని నటీనటులు కెరీర్ మొదట్లో ఎదుర్కొనే ఒత్తిళ్లు, విమర్శలపై కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన చిరునవ్వుపై కూడా విమర్శలు వచ్చేవని, అయితే వాటిని అధిగమించి ముందుకు సాగడమే ముఖ్యమని పేర్కొంది. ‘మిమ్మల్ని మీరు నమ్మడమే మీ సూపర్ పవర్’ అని చెబుతూ, విమర్శలకు కుంగిపోకుండా కష్టపడితేనే మార్పు సాధ్యమని చెప్పింది. మనసు మాట వింటూ శ్రమించాలని తెలిపింది.