AKP: మరుపాక ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు మార్చి 31తో దరఖాస్తు గడువు ముగుస్తుందని ప్రిన్సిపల్ కే. సత్య సునీల్ సోమవారం తెలిపారు. 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12న పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.