TG: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే TG EAPCET-2026 పరీక్షకు దరఖాస్తుల గడువు APR 4వ తేదీ వరకు ఉంది. పరీక్షలు MAYలో జరగనున్నాయి. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని వారు APR 10 లోపు రూ.250తో, APR 15 లోపు రూ.500, 20వ తేదీ లోపు రూ.2,500, APR 24లోపు రూ.5 వేలు, MAY 2 వరకు రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.