JGL: ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానమని, మెట్పల్లి డీఎస్పీ రాములు అన్నారు. మెట్పల్లి పట్టణంలోని 26వ వార్డులో కౌన్సిలర్ రమేశ్ నూతనంగా ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను డీఎస్పీ రాములు సోమవారం ఛైర్మన్ లింబాద్రితో కలిసి ప్రారంభించారు. భద్రతను పెంపొందించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.