TG: రైతులు వాడుతున్న గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని, దానిని వెంటనే నిషేధించాలని అసెంబ్లీ తీర్మానించింది. అనేక దేశాల్లో ఇప్పటికే దీనిపై నిషేధం ఉందని, దీనివల్ల ప్రాణనష్టం జరుగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గడ్డి మందు వల్ల తలెత్తుతున్న అనర్థాలను దృష్టిలో ఉంచుకుని, దీనిని దేశవ్యాప్తంగా నిషేధించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.