NGKL: గత ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని సిటిజన్ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్ బాదావత్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. నిధులు రాక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని వి. రాజశేఖర్ శర్మ, వెంకటయ్య కోరారు.