AKP: మూలపేట పోర్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్లు నిధులు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసినట్లు తెలిపారు. పనులు వేగవంతం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు.