TPT: సత్యవేడు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి డాక్టర్ ఎస్. నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడిగా బి. మహేష్, కార్యదర్శిగా బి. రాజా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల అభినందనలు తెలియజేశారు. కొత్త కార్యవర్గం న్యాయవాదుల సంక్షేమం, అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.