MBNR: జడ్చర్లలో నిర్వహించిన టీఎన్జీవో ఎన్నికల్లో నియోజకవర్గ అధ్యక్షుడిగా తిరుపతయ్య, జనరల్ సెక్రటరీగా సాయన్న, ఈసీ మెంబర్ గా విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని మిడ్జిల్ మండల పంచాయతీ కార్యదర్శులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తిరుపతయ్య తెలిపారు.