జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ కోదండ రామాలయంలో జడ్పీ మాజీ ఛైర్పర్సన్ వసంత సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె స్వామివారికి ఒడి బియ్యం సమర్పించగా, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఛైర్మన్ హరీశ్ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వొద్ది శ్రీలత, స్థానిక మహిళలు పాల్గొన్నారు.