SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 50 మంది తమ సమస్యలను కలెక్టర్ ప్రావిణ్యకు విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు పాల్గొన్నారు.