GDWL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో మొత్తం 10 ఫిర్యాదులు అందాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో భూతగాదాలకు సంబంధించి 3, గొడవలు 1, మిస్సింగ్ 1, అధిక వడ్డీ వేధింపులపై 1 ఫిర్యాదు వచ్చాయి. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.