SDPT: బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. గైనకాలజీ, దంత, చర్మ, ఎముకలు, కంటి వైద్య నిపుణులు రోగులకు సేవలందిస్తారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఉచిత చికిత్స, మందులు అందుబాటులో ఉంటాయని వైద్యాధికారి డా. మాధురి తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.