TG: శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉద్యమకారులు లేకపోతే నేడు సీఎంలు, మంత్రులు ఉండేవారా?’ అని నిలదీశారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కాంగ్రెస్ ఆ బాధ్యతను నిర్వర్తిస్తే చరిత్ర అవుతుందని.. పట్టించుకోకపోతే చారిత్రక తప్పిదం అవుతుందని హెచ్చరించారు. ఉద్యమకారులకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.