తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. APలోని ఒంటిమిట్టలో అత్యధికంగా 42.31°C ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి, జగ్గయ్యపేట, కర్నూలులోనూ 41°C దాటింది. కడప, అనంతపురంలో 40°C ఎండలతో జనం అల్లాడుతున్నారు. TGలో జగిత్యాలలో 41.9°C, కొత్తగూడెం, నల్గొండ, నిజామాబాద్లో 41°C వేడి కొనసాగుతోంది. మధ్యాహ్నం పూట జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags :