GDWL: అయిజ పట్టణ అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సోమవారం గద్వాల జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ‘మన ఊరు – మన బడి’ కింద నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని, కొత్త బస్టాండ్‌లో సీసీ రోడ్లు, ప్రయాణికులకు వసతులు కల్పించాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.