TG: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై ఉప్పర్పల్లి కోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్పై న్యాయస్థానం రేపు తన తుది తీర్పును వెలువరించనుంది. కాగా.. డ్రగ్స్ మూలాలు, నెట్వర్క్ను ఛేదించేందుకు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు పట్టుబడుతున్నారు.