కడప: సిద్ధవటం (M) భాకరాపేటలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంతో పాటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.