NLR: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల కోవూరు పర్యటనలో MLA ప్రశాంతి రెడ్డి పలు సమస్యలను ఆయనకు విన్నవించారు. రైతుల ముఖాముఖిలో రైతుల విన్నవించిన సమస్యలను, రేషన్ కార్డుల విభజనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. దీనికి మంత్రి నాదెండ్ల సానుకూలంగా స్పందించి ఒకరోజు నెల్లూరులోనే ఉండి రైతులు సమస్యలు పరిష్కరిస్తామన్నారు.