ప్రకాశం: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం మార్కాపురం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ తమకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని, సమ్మె కాలానికి సంబంధించిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.