ఎప్పుడైనా ప్రయాణాల్లో ఉన్న సమయంలోనో లేదా సిగ్నల్ సరిగ్గా లేని ప్రాంతంలో ఉన్నప్పుడో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే.. రీల్స్ లోడ్ అవ్వక తెగ బాధ పడిపోతుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ‘మెటా’ యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ సిద్ధమవుతోంది. ఇంటర్నెట్ లేకపోయినా రీల్స్ చూసేలా సరికొత్త ‘ఆఫ్లైన్ రీల్స్’ ఫీచర్ను పరీక్షిస్తోంది.