NDL: బేతంచర్ల పట్టణానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి సోమవారం రానున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి తెలిపారు. ఉదయం 10 గంటలకు పట్టణంలోని శేషారెడ్డి కాలనీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల సమయంలోనే పేదలకు నిర్మించిన గృహప్రవేశాలకు ఎమ్మెల్యే హాజరవుతారన్నారు. శేషారెడ్డి పాఠశాలకు ఎదురుగా సీసీ రోడ్డుకు భూమి పూజ చేస్తారని పేర్కొన్నారు.