సత్యసాయి: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పార్టీ జెండాను ఎగురవేసి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులను, కార్యకర్తలను ఘనంగా సన్మానించారు.