NRPT: రాష్ట్రంలోని వివిధ స్పోర్ట్స్ స్కూల్స్లో ప్రవేశాల కోసం ఈనెల 31న నారాయణపేట స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేష్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి ఎంపికలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 4వ తరగతి ప్రవేశాలకు ఎంపికలు ఉంటాయని, వయస్సు 8 నుంచి 9 సంవత్సరాలు ఉండాలని సూచించారు.