KRNL: గూడూరు మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు ఆధ్వర్యంలో నిన్న మార్కెట్లకు బహిరంగంగా 2026-27వ సంవత్సరానికి వేలం ప్రకటించారు. వారపు సంత మార్కెట్కు రూ.5.25 లక్షలు, కూరగాయల మార్కెట్కు రూ.12.14 లక్షలు, గొర్రెల మాంసం మార్కెట్కు రూ.40 వేలు, గొర్రెల కమేళాకు రూ.36 వేల ప్రకారం బహిరంగంగా వేలం జరిగింది. గతేడాది కంటే ఈ సంవత్సరం రూ.2.95 లక్షల ఆదాయం ఎక్కువ వచ్చిందన్నారు.