AP: దేశంలోనే అమరావతి, హైదరాబాద్ రెండూ అగ్రస్థానంలో ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గుంటూరు- విజయవాడ మధ్యలో రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజధానిగా అమరావతికి జగన్ మద్దతు ఇచ్చారని.. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక మాట మార్చారని ఆరోపించారు. రాజధానిపై జగన్‌వి ఊసరవెళ్లి రాజకీయాలని విమర్శించారు.