AP: విభజన జరిగినప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎక్కడున్నారో తెలీయదని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన జరిగిన తర్వాత ఏపీలో కార్యాలయాలు లేవని తెలిపారు. కార్యాలయాలు లేకపోతే బస్సులో ఉండే పరిపాలన చేశామన్నారు. 9 నెలల్లోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. సింగపూర్ కంటే మెరుగైన రాజధాని నిర్మాణానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.