HYD: సికింద్రాబాద్ రాణిగంజ్‌లో నకిలీ బేరింగుల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. SKF బ్రాండ్ పేరుతో కల్తీ మాల్ అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో మహంకాళి పోలీసులు మెరుపుదాడులు చేశారు. SV టూల్, బేరింగ్ ఇంటర్నేషనల్ వంటి షాపుల్లో ఏకంగా 1987 నకిలీ బేరింగులు, వేల సంఖ్యలో ప్యాకింగ్ బాక్సులను సీజ్ చేశారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.