విజయనగరం విజ్జిస్టేడియంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ముఖ్యఅతిథిగా విజయనగరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా విజ్జి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గల అన్నీ డిపార్ట్మెంట్లను గవర్నర్ పరిశీలించారు. వాటి పనితీరును, అభివృద్ధి, తదితర అంశాలపై స్పోర్ట్స్ అభివృద్ధి అధికారితో వివరాలు అడిగారు.