కడప: జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెట్టింగ్ భక్తులను ఆకర్షిస్తోంది. రంగురంగుల పూలతో అలంకరించిన సెట్టింగ్‌ను తిలకించేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తున్నారు.