TG: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ దృష్ట్యా ఈనెల 28, 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 వరకు పనిచేయనున్నాయి. స్లాట్ల సంఖ్యను పెంచడంతో పాటు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి ఇది గొప్ప వెసులుబాటు.