HNK: మడికొండ ప్రాంతానికి చెందిన పలువురు BRS నేతలు ఇవాళ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీలో చేరిన నేతలకు మంత్రి సూచించారు.