MDK: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామ శివారులో ఉన్న ప్రధాన రహదారిపై గల కల్వర్టు దీనావస్థకు చేరుకుంది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఈ కల్వర్టు పూర్తిగా దెబ్బతిని, ఒక పక్కకు కూలిపోయింది. కూలిపోయిన పక్కనే చెరువు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు రక్షణ కల్పించాలన్నారు.