GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదపలకలూరు గ్రామ కొండ ప్రాంతంలో పేకాట జరుగుతున్నట్టు సమాచారం అందడంతో గురువారం టాస్క్ ఫోర్స్, ఎస్బీ సిబ్బంది సంయుక్తంగా దాడి చేపట్టారు. ఈ దాడిలో నిర్వాహకుడు ఎస్కే అలీతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 సెల్ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రూ.61,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.