MBNR: జడ్చర్ల మండలంలోని సోమశిల మాదిరిగా ఉదండాపూర్ రిజర్వాయర్ సమీపంలో పర్యాటకులు బస చేయడానికి టూరిస్ట్ హోటల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గురువారం అసెంబ్లీలో అన్నారు. రిజర్వాయర్ సమీపంలో అడవి ప్రాంతం ఉండడంతో ట్రెక్కింగ్ సదుపాయాన్ని కల్పించాలన్నారు.సెలవు దినాలలో పర్యాటకులు ఉదండాపూర్ రిజర్వాయర్ సందర్శించి ఆనంద వ్యక్తం చేసే అవకాశం ఉందన్నారు.