ELR: విదేశాల్లో వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిలువునా ముంచిన ఘటన జంగారెడ్డిగూడెంలో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన షంషీర్ అహ్మద్ కుమార్తె, మేనల్లుడికి సీట్ల కోసం మహబూబ్ నగర్‌కు చెందిన గుండా రాఘవ రూ.19.50 లక్షలు వసూలు చేశాడు. పలుదఫాలుగా నగదు తీసుకొని సీట్లు ఇప్పించకుండా కాలయాపన చేయడంతో బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.