జీన్స్ వేసుకుంటే పిల్లలు పుట్టరనేది అపోహ మాత్రమే. కానీ, బిగుతు దుస్తులు సంతానోత్పత్తిని తగ్గిస్తాయనేది వాస్తవం. గంటల తరబడి కూర్చుని పని చేసేవారు, వేడి వాతావరణంలో ఉండేవారు జీన్స్ వేసుకుంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు కాటన్ దుస్తులు, వదులుగా ఉండే ప్యాంట్లు వేసుకోవాలి. ఆఫీసులో గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో నడవడం వల్ల శరీరంలో వేడి అదుపులో ఉంటుంది.