RR: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని ఎన్జీవోస్ కాలనీవాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న గ్రంథాలయం పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యేని కోరారు. స్పందించిన MLA గ్రంథాలయం పనులు రేపటి నుంచి ప్రారంభించాలని గ్రంథాలయం ఈఈ, డీఈలను ఆదేశించారు. వెంటనే స్పందించి పనులను ప్రారంభించనుండటంతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.