TPT: ప్రతి రైతు పాడి పరిశ్రమ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జడ్పీటీసీ విజయలక్ష్మి పేర్కొన్నారు. సత్యవేడు మండలంలోని పాలగుంట గ్రామంలో నిర్వహించిన లేగ దూడల ప్రదర్శన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేగ దూడల సంరక్షణపై రైతులకు సూచనలు అందిస్తూ, పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.