BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మణుగూరులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల వసతి గృహానికి శాశ్వత భవన నిర్మాణం కోసం 29 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.