KMM: నేలకొండపల్లి మండలంలో ఇటీవల అనారోగ్యంతో వాకా రంగయ్య మృతి చెందారు. రంగయ్య కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి తుంబూరి దయాకర్ రెడ్డి ఇవాళ పరామర్శించారు. ముందుగా రంగయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.