BHNG: జనగణన-2027 ఫేజ్-1లో భాగంగా గృహాల జాబితా, గృహ గణన (HLO) నిర్వహణకు నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమం ఈ నెల 24-26 వరకు మూడు రోజుల పాటు ఉంటుందన్నారు.