CTR: పుంగనూరు(M) డిప్యూటీ ఎంపీడీవోగా ఎస్. జాకీర్ హుస్సేన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పెద్దపంజాణి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన, పదోన్నతిపై ఇక్కడికి బదిలీ అయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీడీవో ఆదేశాల మేరకు పంచాయతీల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.